సునామి వస్తే అది అందరినీ ముంచుతుంది అనేది కొంతే నిజము కానీ, ఈనాటి కొరోనా సంక్షోభం మాత్రం ప్రపంచాన్ని మొత్తం ఊచకోత కోయడమే కాక ఆర్ధికంగా సామాజికంగా ఆరోగ్యపరంగా మానసికంగా కష్ట - నష్టాలకు గురిచేసింది .తద్వారా, ఉపాధి లేక (కోల్పోయి) చాలా వర్గాల ప్రజలు ఆర్థిక ఒత్తిళ్లుఎదుర్కొంటున్నారు. ఇందులో ఏ వర్గానికీ మినహాయింపు లేదు - ఎవరి ఇబ్బందులు వారికి వుండనే ఉన్నాయి.
అందులో ప్రవేటు ఉపాధ్యాయులు మరియు
అధ్యాపకులు పడుతున్న ఇబ్బందులను మాత్రం నేను ముఖ్యంగా , ప్రస్తావించదలుచుకున్నాను. యదార్ధంగా ఒక (డాక్టరేట్ పొందిన) అధ్యాపకుడు ఆర్థిక భారం మోయలేక రోజు కూలికి వెళుతున్నడని తెలిసి చలించిపోయాను. మరికొందరు బలవంతపు మరణాలకు సిద్ధపడుతున్నారు. ఇంత కఠిన నిర్ణయాలకు దారితీసిన కారణాలు కొన్ని ఉన్నాయి.
ఈ వృత్తిలో ఉండే చాలామంది
దారిద్రరేఖకు దిగువన బ్రతికే వారే ఉన్నారు. రేషన్ కార్డు లేక ,ఆరోగ్యశ్రీ
కార్డు లేక,సొంత ఇల్లు లేక చాలీచాలని జీతాలతో, సతమతమవుతూ , మనసులో ప్రేత కళ పెట్టుకొని, ముఖంలో మాత్రం చిరునవ్వు పులుముకొని ,ఆనందంగా
తరగతి గదిలో "విక్రమార్కుని" వలె పాఠాలు చెపుతూ "విద్యార్థులను ప్రయోజకులను చేయాలి", అనే భావనే జీవితాశయముగా
పెట్టుకొని బ్రతుకుతున్నారు. లాక్ డౌన్ కాలంలో ఎవరూ పట్టిచ్చుకోని వర్గం ఏదైనాందంటే అది ఒక్క "ప్రవేటు ఉపాధ్యాయులు/అధ్యాపకులు మాత్రమే అని
చెప్పగలను. వీరిని ఏ సమాజమూ ఆదుకోలేదు, ఆదరించనూలేదు.
గడిచిన ఆరు నెలలుగ ఏ పనిచేయాలన్నా ఎక్కడ కరోనా వ్యాధి సోకి తమకు తద్వారా తమ కుటుంబసభ్యులకీ అదివ్యాపిస్తుందో అనే ఆలోచనతో ఎలాంటి పనులకు వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చుంటున్నారు.అటు ఆదాయమూ లేక ఇటు సరైన ఉపాధీ లేక ఆర్ధికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగనిఎవరినీ నోరు తెరిచి అడగలేరు.(మా వృత్తి అలాంటిది). ప్రతి చోట ఆన్లైన్ బోధనా
విధానాలు మరియు అంతర్జాల మాధ్యమాల్లో చదువు వాడుకలో లేవు అనేవి కూడా గమనించగలరు. గౌరవం మాటున వారు మరోకరిని నోరు తెరచి సాయమడగలేరు. ఎలాంటి ఉపాధి లేక
అల్లాడుతున్నారు.
అయితే, నా వరకు నేను ఒక అధ్యాపకునికి 25
కేజీల బియ్యం ఇవ్వగలిగాను. ( అలా అని నేను సంపన్నుడిని
కాదు. అలాగే నేను చేసింది గొప్ప అని చెప్పడంలేదు. అది నాకు కొంత తృప్తిని
మిగిల్చింది) .మా పట్టణంలో ఒక దాతకు చెప్పాను " అయ్యా , మీరు చాలా మందికి లాక్ డౌన్ కాలంలోనూ , తర్వాత
సహాయం చేశారు. కానీ , మీరు ఒక స్కూల్
గుర్తించి అక్కడ ఉన్న టీచర్లకు ఎదైనా సహాయం చేయండి" అని ఒక మంచి సూచన చేశాను.
ఎందుకంటే పరస్పర సహాయ సహకారాల వల్ల కష్టాలు అనేవి సమసిపోతాయి.
ఇప్పట్లో ఈ పరిస్థితి సాధారణమయ్యే అవకాశం లేదు. మాకు ఆహారం లేదు . ఆరోగ్యం
సక్రమంగా చేసుకొనే స్థితిలో లేము . అయినా జీతాలు వచ్చే పరిస్థితులు
కనపడటం లేదు.ఈ సంక్షోభంలో విమర్శ కంటే పరిష్కారానికి పెద్దపీట వేయాలి అని
కోరుతున్నాను.
ఈ సమకాలీన సమస్యల పై ప్రభుత్వం స్పందించి సత్వర నిర్ణయం
తీసుకొని వారికి అండగా ఉండాలని నేను కోరుకోవడం లేదు. సగటున 70% పైగా ప్రైవేట్ భాగస్వామ్యం తో నడిచే దేశ విద్యా వ్యవస్థ లో ప్రైవేట్ ఉపాధ్యాయులు
మరియు అధ్యాపకుల పాత్ర ఎంత విలువైనదో గమనించగలరు.
త్వరలో రానున్న ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా అందరూ తగిన విధంగా స్పందిచాలని కోరుకుంటున్నాను. ఉపాధ్యాయులు నోరు తెరచి అడగలేరు కాబట్టి మీరే చొరవతో సహాయం చేయాలని ఆశిస్తున్నా. దీనికి సత్వర ఉపశమన మార్గంగ ఆయా వీధుల్లో ఉండే వారు , మంచి మనసు ఉన్న వారు , దాతలు ముందుకి వచ్చి సహాయం చేయగలరు.
ఆవేదనతో:
డా|| రామావజ్జల నాగభూషణ శర్మ.,
చరిత్ర పరిశోధకులు, ప్రొద్దుటూరు.

Excellent expression of the present scenario and deep concern for the teaching community...Thank you sir.
ReplyDeleteExcellent expression of the present scenario and deep concern for the teaching community...Thank you sir.
ReplyDeleteEverybody should think about this and should contribute something. A welfare fund to be organised to give some solace to the needy teachers. If organised I too will contribute.
ReplyDeleteSir you are a good literature sir.....and motivational speech is also very good sir...thank you sir🙏
ReplyDelete